ఆటో బోల్తా ; నలుగురికి గాయాలు | auto accident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా ; నలుగురికి గాయాలు

Aug 30 2016 12:20 AM | Updated on Sep 4 2017 11:26 AM

ఆటో బోల్తా  ; నలుగురికి గాయాలు

ఆటో బోల్తా ; నలుగురికి గాయాలు

ఆటో బోల్తా పడి నలుగురికి తీ వ్ర గాయాలైన సంఘటన మండలంలోని ఐనాపూర్‌ – పోసానిపల్లి రహదారిలో సో మవారం చోటు చేసుకుంది. కొమురవెల్లికి చెందిన కడెం రేణుక, కడెం కొండయ్య, కడెం యా దవ్వ, కడెం పోచమ్మతో పాటు కుటుంబ సభ్యులు నాగపురిలోని తమ బంధువు అంత్యక్రియలకు ఆటోలో బయలుదేరారు.

చేర్యాల : ఆటో బోల్తా పడి నలుగురికి తీ వ్ర గాయాలైన సంఘటన మండలంలోని ఐనాపూర్‌ – పోసానిపల్లి రహదారిలో సో మవారం చోటు చేసుకుంది. కొమురవెల్లికి చెందిన కడెం రేణుక, కడెం కొండయ్య, కడెం యా దవ్వ, కడెం పోచమ్మతో పాటు కుటుంబ సభ్యులు నాగపురిలోని తమ బంధువు అంత్యక్రియలకు ఆటోలో బయలుదేరారు. పోసానిపల్లి–ఐనాపూరు ప్రాంతానికి చేరుకోగానే ఆటోకు ఎదురుగా టాటా సుమో వేగంగా దూసుకొచ్చింది. ఈక్రమంలో దాన్ని తప్పించబోయి అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కడెం రేణుక తలకు తీవ్రగాయమై చేయి విరిగింది. కడెం కొండయ్య కాళ్లు, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు కడెం యాదవ్వ, కడెం పోచమ్మకు గాయాలయ్యాయి. వారిని వెంటనే చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సిద్ధిపేటకు తరలించారు.  

Advertisement
 
Advertisement
Advertisement