ఏలూరు, సాక్షిప్రతినిధి : సాక్షి మీడియా విలేకరులపై దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి యత్నించారు. కెమేరాలు, సెల్‌ఫోన్లు లాక్కున్నారు. తొలుత పెదవేగి మండలం బి.శింగవరంలోని తమ్మిలేరు సమీపంలో బుధవారం వనం–మనం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది.
‘సాక్షి’ విలేకరులపై దాడి
Aug 25 2016 1:30 AM | Updated on Sep 4 2017 10:43 AM
ఏలూరు, సాక్షిప్రతినిధి : సాక్షి మీడియా విలేకరులపై దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అనుచరులు దాడికి యత్నించారు. కెమేరాలు, సెల్‌ఫోన్లు లాక్కున్నారు. తొలుత పెదవేగి మండలం బి.శింగవరంలోని తమ్మిలేరు సమీపంలో బుధవారం వనం–మనం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన చింతమనేని ప్రభాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక కార్యకర్త ఒకరు చింతమనేనిని నిలదీయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన కార్యకర్తపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో సాక్షి మీడియా జిల్లా సిబ్బంది ఆ ఘటనను చిత్రీకరించేందుకు శింగవరం గ్రామానికి బుధవారం సాయంత్రం వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని గ్రామంలో ఉన్న తన అనుచరులైన చింతమనేని సతీష్, మరో 30 మందిని రంగంలోకి దింపారు సాక్షి సిబ్బందిపై దాడికి యత్నించారు. అంతే కాకుండా వెంటపడి సిబ్బంది వద్దనున్న కెమేరాలు, సెల్‌ఫోన్లు, టీవీ చానల్‌కు సంబంధించిన చిప్‌లను సైతం లాక్కున్నారు. అతి కష్టమ్మీద ఏలూరు చేరుకున్న సిబ్బంది ఈ ఘటనపై డీఐజీ, ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
Advertisement


