టీడీపీ జిల్లా కార్యదర్శి రమాకాంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది
టీడీపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు
Nov 5 2016 11:54 PM | Updated on Sep 15 2018 2:43 PM
పెద్దకడబూరు : టీడీపీ జిల్లా కార్యదర్శి రమాకాంత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గ్రామానికి చెందిన ఎస్సీ బొగ్గుల రోగన్న బైక్‌పై ఆదోనికి వెళ్తుండగా, అదే సమయంలో రమాకాంత్‌రెడ్డి కుటుంబీకులతో వాహనంలో ముందు వెళ్తున్నాడు. ముందుగా వెళ్తున్న వాహనం సైడ్ ఇవ్వాలని రోగన్న పలుమార్లు హారన్ కొట్టినా సైడ్ ఇవ్వలేదు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఎందుకు సైడు ఇవ్వడం లేదని అడుగగా.. రమకాంతరెడ్డి తనను కులం పేరుతో దూషించాడని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ మహబూబ్‌బాషా తెలిపారు. అలాగే ఎస్సీ బొగ్గుల రోగన్నతో తమకు ప్రాణహాని ఉందని రమాకాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Advertisement
Advertisement