జాతీయ ఈత పోటీలకు అరుణ్‌రెడ్డి | Arun reddy selected national swimming competitions | Sakshi
Sakshi News home page

జాతీయ ఈత పోటీలకు అరుణ్‌రెడ్డి

Oct 18 2016 10:09 PM | Updated on Sep 4 2017 5:36 PM

జాతీయ ఈత పోటీలకు అరుణ్‌రెడ్డి

జాతీయ ఈత పోటీలకు అరుణ్‌రెడ్డి

కేబీఎన్‌ కళాశాల విద్యార్థి పి.అరుణ్‌రెడ్డి గుజరాత్‌లో జరిగే అండర్‌–19 జాతీయ స్కూల్‌ గేమ్స్‌ ఈత పోటీలకు ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు తెలిపారు.

వన్‌టౌన్‌ : కేబీఎన్‌ కళాశాల విద్యార్థి పి.అరుణ్‌రెడ్డి గుజరాత్‌లో జరిగే అండర్‌–19 జాతీయ స్కూల్‌ గేమ్స్‌ ఈత పోటీలకు ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు తెలిపారు. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అరుణ్‌రెడ్డి అండర్‌–19 కేటగిరీ 50 మీటర్ల బటర్‌ ఫ్లై, వంద మీటర్ల మిడ్‌ రిలే విభాగాల్లో బంగారు పతకాలు, 50 మీటర్లు, 100 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌లో రజత పతకాలు పొందాడని చెప్పారు. ఈ సందర్భంగా కాలేజీలో మంగళవారం అరుణ్‌రెడ్డిని పలువురు అభినందించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement