మిస్ ఫైర్ కాదు.. ఆత్మహత్యే..! | AR constable commits suicide with revolver | Sakshi
Sakshi News home page

మిస్ ఫైర్ కాదు.. ఆత్మహత్యే..!

May 14 2016 3:45 PM | Updated on Apr 8 2019 8:33 PM

మిస్ ఫైర్ కాదు.. ఆత్మహత్యే..! - Sakshi

మిస్ ఫైర్ కాదు.. ఆత్మహత్యే..!

ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రిలో జరిగిన మిస్ ఫైరింగ్ వ్యవహారంలో కొత్తకోణం వెలుగుచూసింది.

ఆదిలాబాద్:  ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రిలో జరిగిన మిస్ ఫైరింగ్ వ్యవహారంలో కొత్తకోణం వెలుగుచూసింది. కుటుంబ కలహాలతోనే గంగాధర్ బలవన్మరణానికి పాల్పడినట్టు ఎస్పీ తరుణ్ జోషి వెల్లడించారు. ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు ఇంటి వద్ద జరిగిన ఈ ఘటనపై విచారించిన ఎస్పీ.. కానిస్టేబుల్ గంగాధర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తమ విచారణలో వెల్లడైనట్టు చెప్పారు.

కాగా, చెన్నూరు ఎమ్మెల్యే, తెలంగాణ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు నివాసం వద్ద శనివారం మిస్ ఫైర్ చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో ఏఆర్ కానిస్టేబుల్ గంగాధర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని ఓదేలు ఇంటి వద్ద ఈరోజు మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ గంగాధర్ను చికిత్స నిమిత్తం సింగరేణి ప్రభుత్వ  ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement