యువజన అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం | applications invited for national yuvajana awards | Sakshi
Sakshi News home page

యువజన అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

Jul 26 2016 10:49 PM | Updated on Sep 4 2017 6:24 AM

జాతీయ యువజన అవార్డుల కోసం ఆసక్తిగల యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమశాఖ అధికారి రాంరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

సంగారెడ్డి జోన్: జాతీయ యువజన అవార్డుల కోసం ఆసక్తిగల యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన సంక్షేమశాఖ అధికారి రాంరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవలో ఉత్తమ సేవలందించిన 15 – 29 సంవత్సరాల మధ్య వయువస్సు ఉన్న యువతీ యువకుల నుంచి, మూడేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిజిష్టర్‌ అయిన స్వచ్ఛంద సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. జాతీయ వ్యక్తిగత అవార్డు కోసం మూడేళ్లుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి ఉండాలన్నారు. స్వచ్ఛంద సంస్థలైతే 1860 సొసైటీ యాక్టు ప్రకారం నమోదై మూడేళ్లుగా పనిచేస్తూ ఉండాలన్నారు. అర్హులైన వారు వచ్చే నెల 5లోగా దరఖాస్తులు అందజేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement