శ్రీశైల దేవస్థానం పరిధిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్ట్ర పీఠంలో 2016–17 విద్యా సంవత్సరానికి ఎంఏ ప్రథమ సంవత్సరం (చరిత్ర, పురావస్తుశాస్త్రం) ప్రవేశానికి ఈ నెల 15 లోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలుగువర్శిటీ డీన్ ఆచార్య పి చెన్నారెడ్డి గురువారం తెలిపారు.
ఎంఏలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
Oct 14 2016 12:05 AM | Updated on Sep 4 2017 5:05 PM
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్ట్ర పీఠంలో 2016–17 విద్యా సంవత్సరానికి ఎంఏ ప్రథమ సంవత్సరం (చరిత్ర, పురావస్తుశాస్త్రం) ప్రవేశానికి ఈ నెల 15 లోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలుగువర్శిటీ డీన్ ఆచార్య పి చెన్నారెడ్డి గురువారం తెలిపారు. మొత్తం 26 సీట్లు ఉన్నాయని, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సంబంధిత సర్టిఫికెట్లతో పాటు రూ. 350లు ప్రవేశ రుసుం చెల్లించాలని, మిగతా వివరాల కోసం 08524–287153, 9440047299ను సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement