రూపురేఖలు ఇవే | Appearance this | Sakshi
Sakshi News home page

రూపురేఖలు ఇవే

Aug 27 2016 12:52 AM | Updated on Sep 4 2017 11:01 AM

రూపురేఖలు ఇవే

రూపురేఖలు ఇవే

జిల్లాల పునర్విభజన అంశాల్లో నెలకొన్న సందేహాలకు కొంత స్పష్టత వచ్చింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జయశంకర్‌ జిల్లాకు భూపాలపల్లి పరిపాలన కేంద్రం కానుంది. వరంగల్‌ జిల్లాకు వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని వరంగల్‌ మండల ప్రాంతం కేంద్రం అవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

  • అధికారికంగా వెల్లడించిన ప్రభుత్వం
  • కొత్త జిల్లాల కేంద్రాల గుర్తింపు  
  • సాక్షిప్రతినిధి, వరంగల్‌ : జిల్లాల పునర్విభజన అంశాల్లో నెలకొన్న సందేహాలకు కొంత స్పష్టత వచ్చింది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జయశంకర్‌ జిల్లాకు భూపాలపల్లి పరిపాలన కేంద్రం కానుంది. వరంగల్‌ జిల్లాకు వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలోని వరంగల్‌ మండల ప్రాంతం కేంద్రం అవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఇప్పటికే ముసాయిదాను జారీ చేసి అభ్యంతరాలు స్వీకరిస్తున్న ప్రభుత్వం తాజాగా ప్రతిపాదిత జిల్లాల మ్యాప్‌లను విడుదల చేసింది.
     
    మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లా కేంద్రాలను అందులో పేర్కొన్నారు. రైల్వేలు, జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా సరిహద్దు, మండలాల సరిహద్దు, అసెంబ్లీ నియోజయవర్గం పరిధి, నదులు వంటిని ఈ మ్యాపులలో పొందుపరిచారు. కొత్తగా విడుదల చేసిన మ్యాప్‌లలో జిల్లా కేంద్రాలను పేర్కొన్నారు. జిల్లా కేంద్రంగా ఉండే ప్రాంతాన్ని నక్షత్రం గుర్తుతో పేర్కొన్నారు. ఇలా జయశంకర్‌ జిల్లాకు భూపాలపల్లిని, వరంగల్‌ జిల్లాకు వరంగల్‌ మండలంలోని ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement