కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం

Published Sat, Oct 3 2015 6:51 PM

కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం - Sakshi

ఏలూరు : కాంగ్రెస్ క్యార్తకర్తల అత్యుత్సాహం రెండు మూగ ప్రాణులను బలి తీసుకుంది.  ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ కార్యకర్తులు అతి ప్రదర్శించారు. శనివారం కొవ్వూరులో రఘువీరా పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వినూత్నంగా ఏర్పాట్లు చేశారు.

బాణాసంచా పేల్చుతూ... తారాజువ్వలకు రెండు పావురాలను కట్టారు. తారాజువ్వలను పేల్చటంతో ఆ పావురాలు మృతి చెందారు. అయితే ఈ సమయంలో రఘువీరారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. అయితే ఈ ఘటనపై ఆయన ఏమీ మాట్లాడకపోవటంతో ....ఆర్భాటం కోసం పక్షుల ప్రాణాలు తీస్తారా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement