'మళ్లీ దీక్ష చేసినా ఎవరు మద్దతివ్వరు' | ap ministers comments on mudragada padmanabham letter | Sakshi
Sakshi News home page

'మళ్లీ దీక్ష చేసినా ఎవరు మద్దతివ్వరు'

Mar 3 2016 11:43 AM | Updated on Sep 3 2017 6:55 PM

'మళ్లీ దీక్ష చేసినా ఎవరు మద్దతివ్వరు'

'మళ్లీ దీక్ష చేసినా ఎవరు మద్దతివ్వరు'

కాపు నేత ముద్రగడ పద్మనాభం చర్యలు కాపు జాతికి ద్రోహం చేసేలా ఉన్నాయని మంత్రులు కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు.

విశాఖ: కాపు నేత ముద్రగడ పద్మనాభం చర్యలు కాపు జాతికి ద్రోహం చేసేలా ఉన్నాయని మంత్రులు కొల్లు రవీంద్ర, గంటా శ్రీనివాసరావు మండిపడ్డారు. ముద్రగడ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాసిన లేఖలో భాష అభ్యంతరకరంగా ఉందని మండిపడ్డారు. గురువారం ఉదయం వారు స్థానిక సర్క్యూట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు.
 
ముద్రగడ కాపు జాతిని రెచ్చగొడుతూ, నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వీటన్నిటి వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్‌రెడ్డి ఉన్నారని మంత్రులు ఆరోపించారు. ప్రభుత్వం కాపుల సంక్షేమం కోసం అనేక చర్యలు చేపడుతున్నా, మళ్లీ దీక్షలంటూ ఆయన బెదిరిస్తున్నారని చెప్పారు. ఈసారి ఆయన దీక్షకు కూర్చున్నా మద్దతిచ్చేందుకు ఎవరూ ఉండరని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement