ముద్రగడ పురుగుల మందు తాగితే జరిగే పరిణామాలకు చిరంజీవి బాధ్యత వహిస్తాడా అని మంత్రి నారాయణ ప్రశ్నించారు.
విజయవాడ : ముద్రగడ పురుగుల మందు తాగితే జరిగే పరిణామాలకు చిరంజీవి బాధ్యత వహిస్తాడా అని మంత్రి నారాయణ ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభం అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి సీఎం చంద్రబాబుకు లేఖ రాయడంపై నారాయణ విజయవాడలో స్పందించారు. రైళ్లు తగులబెట్టి అమాయకులను భయభ్రాంతులకు గురిచేసిన వారిని శిక్షించాలా? వద్దా అని ప్రశ్నించారు.
మీరు పార్టీ పెట్టారు, శాసన సభ్యుడయ్యారు. రాజ్యసభ సభ్యుడయ్యారు. ఏనాడైనా కాపుల గురించి పట్టించుకున్నారా?.. అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మీరు కాపులను బీసీల్లో చేర్చడానికి కనీస ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని కాపులు ఇప్పుడు గుర్తుకు రావడంలో ఆంతర్యం ఏమిటన్నారు.