ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యునిగా డాక్టర్‌ గోపాల క్రిష్ణయ్య | ap medical council member in gopala krishnaiah | Sakshi
Sakshi News home page

ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యునిగా డాక్టర్‌ గోపాల క్రిష్ణయ్య

Oct 28 2016 11:00 PM | Updated on Sep 4 2017 6:35 PM

ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యునిగా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్‌ వి.గోపాలక్రిష్ణయ్య నియమితులయ్యారు. శుక్రవారం స్థానిక వీజీకే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు ఓ కన్వీనర్, ఇద్దరు సభ్యులుంటారని వారిలో కన్వీనర్‌గా డాక్టర్‌ సి.సాయిప్రసాద్, సభ్యులుగా డాక్టర్‌ బాలరాజు లతో పాటు తనను నియమించినట్లు ఆయన తెలిపారు.

బద్వేలు అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యునిగా పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు  డాక్టర్‌ వి.గోపాలక్రిష్ణయ్య నియమితులయ్యారు. శుక్రవారం స్థానిక వీజీకే ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు ఓ కన్వీనర్, ఇద్దరు సభ్యులుంటారని వారిలో కన్వీనర్‌గా డాక్టర్‌ సి.సాయిప్రసాద్, సభ్యులుగా డాక్టర్‌ బాలరాజు లతో పాటు తనను నియమించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో సౌకర్యాలు ,వసతులు అందిస్తున్న వైద్య సేవలపై ప్రభుత్వానికి  నివేదిక అందజేస్తుంటామని తెలిపారు. మెడికల్‌ , ఫార్మశీ, నర్సింగ్‌ కళాశాలలతోపాటు ఆసుపత్రులను కూడా తనిఖీ చేసే అధికారం కౌన్సిల్‌ సభ్యులకు ఉంటుందన్నారు. అలాగే ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహించేవారు మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement