'తెలుగు ప్రజలను ఉలికిపాటుకు గురి చేసింది' | andhra people very sad due to jayant sinha comments on special status | Sakshi
Sakshi News home page

'తెలుగు ప్రజలను ఉలికిపాటుకు గురి చేసింది'

May 5 2016 2:52 PM | Updated on Jul 24 2018 1:16 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వ్యాఖ్యలు తెలుగు ప్రజలను ఉలికిపాటుకు గురి చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి అన్నారు.

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా వ్యాఖ్యలు తెలుగు ప్రజలను ఉలికిపాటుకు గురి చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్రెడ్డి అన్నారు. గురువారం విశాఖపట్నంలో కొయ్య ప్రసాద్రెడ్డి విలేకర్లలో మాట్లాడుతూ... ఈ వార్తతో తెలుగు ప్రజలంతా బాధాతప్త హృదయాలతో ఉన్నారని చెప్పారు. ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాదాలకింద తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుదని ఆయన ఎద్దేవా చేశారు. ఎంపీ మేకపాట రాజమోహనరెడ్డి సారథ్యంలో శుక్రవారం రైల్వేమంత్రి సురేష్ ప్రభును కలిసి రైల్వేజోన్పై ఒత్తిడి తీసుకొస్తామని కొయ్య ప్రసాద్రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement