
తెలుగుజాతి మణిపూస కాశీనాథుని
తెలుగుజాతి మణిపూస కాశీనాథుని నాగేశ్వరరావు పంతులని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కేంద్రసాహిత్య అకాడమీ, కృష్ణా విశ్వవిద్యాలయం, కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా ఆంధ్రపత్రిక, భారతి పత్రికల సాహిత్యసేవ అంశంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి.
విజయవాడ కల్చరల్: తెలుగుజాతి మణిపూస కాశీనాథుని నాగేశ్వరరావు పంతులని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కేంద్రసాహిత్య అకాడమీ, కృష్ణా విశ్వవిద్యాలయం, కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తంగా ఆంధ్రపత్రిక, భారతి పత్రికల సాహిత్యసేవ అంశంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. మండలి మాట్లాడుతూ ఆంధ్రపత్రిక, భారతి పత్రికలను దాని వ్యవస్థాపకుడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులును వేరుగా చూడలేమని తెలుగవారి సాహితీ గుండెచప్పుడు ఆయనదని అభివర్ణించారు. నాటి తెలుగువారిలో స్వాత్రంత్య్ర కాంక్షను, పత్రికలు అంతగాలేని రోజుల్లోనే తెలుగుపాఠకులలో చదువుల పట్ల ఆసక్తిని కలిగించాయని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ అకాడమీ మరుగున పడిన సాహిత్య నిర్మాతల జీవితాల ఆధారంగా అనేక పుస్తకాలను ప్రచురించిందని వివరించారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి సంచాలకులు డాక్టర్ ఎన్.గోపి భారతి సాహిత్యపత్రిక సేవలను వివరిస్తూ ఆ పత్రికతో తన అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి సభ్యుడు పాపినేని శివశంకర్, డాక్టర్ జీవీ పూర్ణచంద్‌లు ఆంధ్రపత్రిక సాహితీసేవలను వివరించారు.