
హైదరాబాద్: “కృత్రిమ మేధస్సు (AI) తర్వాత రాబోతున్న కృత్రిమ సాధారణ మేధస్సు (AGI) మానవ జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని, అయితే దానితో పాటు మంచి-చెడు పరిణామాలు కూడా మరింత తీవ్రంగా కనిపించనున్నాయి,” అని హెచ్చరించారు ప్రముఖ జర్నలిస్టు, ‘Artificial Intelligence in Modern Journalism’ పుస్తక రచయిత స్వామి ముద్దం.
డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో ‘Future of Journalism in the AI Era’ అనే అంశంపై హైదరాబాద్‌లో జరిగిన సెమినార్‌లో ‘AGI Journalism – Opportunities and Challenges’ అనే అంశంపై స్వామి ముద్దం ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్వామి ముద్దం.. AGI యుగంలో జర్నలిజం ఎదుర్కోనున్న అవకాశాలు, సవాళ్లను చర్చించారు. “AGI మనిషి మాదిరిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగల స్థాయికి ఎదుగుతుంది. ఈ పరిణామం జర్నలిజంపై నమ్మకం, బాధ్యత, నైతిక విలువలపై కొత్త ప్రశ్నలు లేవనెత్తుతుంది,” అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ప్రొ. ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ శ్రీనివాస్ వడ్డానం, డా. యాదగిరి, సీనియర్ జర్నలిస్టులు, AI నిపుణులు పాల్గొన్నారు.