డాక్టర్‌ కొల్లూరికి ఆంధ్ర బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ కొల్లూరికి ఆంధ్ర బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం

Published Sat, Oct 1 2016 10:21 PM

డాక్టర్‌ కొల్లూరికి ఆంధ్ర బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం - Sakshi

అమలాపురం :
స్థానిక ఎస్‌కేబీఆర్‌ కళాశాల తెలుగు విభాగాధిపతి, కవి డాక్టర్‌ ఎస్‌ఆర్‌ఎస్‌ కొల్లూరి రచించిన మహాత్మ కావ్యానికి ఆంధ్ర బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. జాతి పిత మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా స్థానిక విద్యానిధి కళాశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో డాక్టర్‌ కొల్లూరికి ఆంధ్రా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి డాక్టర్‌ శ్యామ్‌ జాదూగర్, విద్యానిధి విద్యా సంస్థల చైర్మన్‌ ఏబీ నాయుడు చేతుల మీదుగా అందకున్నారు. డాక్టర్‌ కొల్లూరి రాసిన మహాత్మ కావ్యం 8,030 అక్షరాలు, 1,442 పదాలతో సుదీర్ఘ ఏక వాక్య పుస్తక శీర్షిక అంశంలో ఆయనకు ఈ రికార్డు దక్కిందని శ్యామ్‌ జాదూగర్‌ వెల్లడించారు. బాపూజీ సిద్ధాంతాలను అమితంగా ప్రేమించే కొల్లూరి నిత్యం తన పూజా మందిరంలో గాంధీ చిత్ర పటానికి పూజలు చేస్తారన్నారు. కొల్లూరి గతంలో గాంధీజీ అంశంగా ముత్యాల సరాలు శతకాన్ని హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో రచించారు. ఈ త్రిభాషా కావ్యాన్ని అప్పటి గవర్నర్‌ ఎన్‌డీ తివారీ ఆవిష్కరించారు.
 

Advertisement
Advertisement