రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ జట్టుకు ‘అనంత లక్ష్మి’ విద్యార్థి | anantha laxmi student to state softball team | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ జట్టుకు ‘అనంత లక్ష్మి’ విద్యార్థి

Aug 26 2016 11:11 PM | Updated on Sep 4 2017 11:01 AM

రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ జట్టుకు అనంత లక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థి భరత్‌ కుమార్‌ ఎంపికైనట్లు కళాశాల చైర్మెన్‌ అనంతరాముడు తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: రాష్ట్ర సాఫ్ట్‌బాల్‌ జట్టుకు అనంత లక్ష్మి ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థి భరత్‌ కుమార్‌ ఎంపికైనట్లు కళాశాల చైర్మెన్‌ అనంతరాముడు తెలిపారు. అనంత క్రీడా గ్రామంలో ఎంపిక ప్రక్రియ సాగిందన్నారు. సెప్టెంబర్‌ 10 నుంచి 12 వరకు గుంటూరు జిల్లా మాచెర్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారన్నారు.

ఈ పోటీలలోనూ విజయం సాధించి కళాశాలకు, రాష్ట్రానికి పేరు తేవాలని డైరెక్టర్‌ రమేష్‌ నాయుడు, ప్రిన్సిపాల్‌ రమేష్‌ బాబు, ఫిజికల్‌ డైరెక్టర్‌ నరసింహులు ఆకాంక్షించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement