యువతి గొంతుకోసిన గుర్తుతెలియని వ్యక్తి | An unidentified man cut the throat of a young woman | Sakshi
Sakshi News home page

యువతి గొంతుకోసిన గుర్తుతెలియని వ్యక్తి

Aug 8 2016 5:29 PM | Updated on May 3 2018 3:20 PM

గాజువాక శ్రీనగర్ అఫీషియల్ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి కావేరి(18) అనే యువతి గొంతు కోశాడు.

గాజువాక శ్రీనగర్ అఫీషియల్ కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి కావేరి(18) అనే యువతి గొంతు కోశాడు. ఈ ఘటనలో ఆమెకు గొంతుపై తీవ్రగాయం కావడంతో గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కావేరికి మూడు నెలల క్రితమే ఈశ్వరరావు అనే వ్యక్తితో వివాహం జరిగింది. భర్త బైక్ మెకానిక్.

 

ప్రొద్దునే బైక్ గ్యారేజీకి భర్త వెళ్లటంతో ఇంట్లో ఒక్కటే ఉంది. ఇది గమనించిన దుండగుడు ఇంటి గుమ్మం దగ్గరకు వెళ్లి మంచి నీళ్లు అడిగాడు. నీళ్లు తీసుకురావడానికి కావేరి ఇంట్లోకి వెళ్లింది. ఆమెతో పాటే దుండగుడు లోపలికి వెళ్లి మెడలోని గొలుసును లాక్కెళ్లబోయాడు. కావేరి ప్రతిఘటించడంతో వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. గాయాలపాలైన కావేరిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలాన్ని విశాఖ సౌత్‌జోన్ ఏసీపీ రామ్మోహన్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement