'వైఎస్ఆర్ జిల్లాపై ఎందుకింత వివక్ష' | Amjad basha takes on chandrababu | Sakshi
Sakshi News home page

'వైఎస్ఆర్ జిల్లాపై ఎందుకింత వివక్ష'

May 22 2016 12:04 PM | Updated on May 29 2018 2:33 PM

వైఎస్ఆర్ జిల్లాపై ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంజాద్‌బాషా ప్రశ్నించారు.

కడప :  వైఎస్ఆర్ జిల్లాపై ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంజాద్‌బాషా ప్రశ్నించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీకి ఒక్కరూపాయి కూడా కేటాయించకపోవడంపై చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.

వెంటనే ఆ యూనివర్సిటీకి రూ.120కోట్లు మంజూరు చేయాలని అంజాద్బాషా డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థులు, అధ్యాపకులతో కలసి ఉద్యమిస్తామని చంద్రబాబును ఆయన హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement