డివైడర్‌ను ఢీకొని అంబులెన్స్‌ దగ్ధం | AMBULANCE COLLIDE RAOD DEVIDER.. AND FIRE | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొని అంబులెన్స్‌ దగ్ధం

Dec 7 2016 12:39 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఎదురుగా వస్తున్న మోటార్‌సైక్లిస్ట్‌ను తప్పించబోయి ఓ అంబులెన్స్‌ డివైడర్‌ను ఢీకొనడంతో మంటలు ఎగిశాయి. మండలంలోని పెదతాడేపల్లి జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఈ ఘటనలో అంబులెన్స్‌ దగ్ధమైంది.

తాడేపల్లిగూడెం రూరల్‌ : ఎదురుగా వస్తున్న మోటార్‌సైక్లిస్ట్‌ను తప్పించబోయి ఓ అంబులెన్స్‌ డివైడర్‌ను ఢీకొనడంతో మంటలు ఎగిశాయి. మండలంలోని పెదతాడేపల్లి జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ఈ ఘటనలో అంబులెన్స్‌ దగ్ధమైంది. తాడేపల్లిగూడెం అగ్నిమాపక దళాధికారి వి.సుబ్బారావు కథనం ప్రకారం.. ఏలూరుకు చెందిన ఎస్‌కేఎస్‌ అంబులెన్స్‌ సర్వీస్‌ వాహనం ఓ రోగిని తీసుకుని తణుకు వెళ్తుండగా డివైడర్‌ను ఢీకొంది. ఆ సమయంలో అంబులెన్స్‌లో డ్రైవర్‌ ఎస్‌కే షఫీవుల్లా, రోగి, అతని బంధువులు ఇద్దరు ఉన్నారు. డివైడర్‌ను ఢీకొన్న వెంటనే మంటలు రావడాన్ని గమనించిన అబులెన్స్‌ డ్రైవర్‌ రోగిని, అతని బంధువులను దించేశారు.  ఆతర్వాత అంబులెన్స్‌ పూర్తిగా దగ్ధమైంది. ఆ తర్వాత రోగిని తణుకు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్టు అగ్నిమాపక దళాధికారి వి.సుబ్బారావు తెలిపారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement