‘అమాయక’ పేరు తెస్తుంది
అమాయక చిత్రం గుర్తింపు తెస్తుందని వర్ధమాన సినీనటి శ్రీవాణిరెడ్డి చెప్పారు.
సీతమ్మధార :అమాయక చిత్రం గుర్తింపు తెస్తుందని వర్ధమాన సినీనటి శ్రీవాణిరెడ్డి చెప్పారు. పెందుర్తి కష్ణరాయపురంలో అమ్మమ్మను చూడటానికి వచ్చిన ఆమె శనివారం సాయంత్రం సీతమ్మధారలో ఉంటున్న మరో వర్ధమాన నటుడు, స్నేహితుడ్ని పరామర్శించేందుకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. 2013లో చెన్నైలో జరిగిన ‘మిస్ సౌత్’ పోటీలో విన్నర్‌గా నిలిచినట్టు చెప్పారు. 2014లో ‘లాటరీ’ చిత్రంలో నటించానన్నారు. కళామందిర్, జోయలుక్కాస్ వంటి సంస్థలకు మోడల్‌గా పనిచేశానన్నారు. అంతేకాకుండా చాలా షార్ట్‌ఫిల్మ్‌లో నటించానని, మంచి గుర్తింపు వచ్చిందన్నారు. మిస్ ఇండియా అవ్వాలనే కోరుకుంటున్నానని, అందుకు తగినవిధంగా శిక్షణ పొందుతున్నానన్నారు.