వ్యవసాయ కళాశాల రజతోత్సవం పోస్టర్‌ ఆవిష్కరణ | agriculture collge silver jubilee posters relese | Sakshi
Sakshi News home page

వ్యవసాయ కళాశాల రజతోత్సవం పోస్టర్‌ ఆవిష్కరణ

Nov 15 2016 11:52 PM | Updated on Jun 4 2019 5:16 PM

వ్యవసాయ కళాశాల రజతోత్సవం పోస్టర్‌ ఆవిష్కరణ - Sakshi

వ్యవసాయ కళాశాల రజతోత్సవం పోస్టర్‌ ఆవిష్కరణ

స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌లోని వ్యవసాయ కళాశాల రజతోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం ఏడీఆర్‌ డాక్టర్‌ బి.గోపాల్‌రెడ్డి, మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ బాలగురువయ్య విడుదల చేశారు.

నంద్యాలరూరల్‌: స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్‌లోని వ్యవసాయ కళాశాల రజతోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం ఏడీఆర్‌ డాక్టర్‌ బి.గోపాల్‌రెడ్డి, మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ బాలగురువయ్య విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1991లో ప్రారంభమైన వ్యవసాయ కళాశాల అంచలంచలుగా అభివృద్ధి చెందిందన్నారు. వేడుకల్లో భాగంగా డిసెంబర్‌ 2న అగ్రి ఫెస్ట్‌ నిర్వహించి విద్యార్థులకు ఆధునికతపై సెమినార్లు, 3న రజతోత్సవాన్ని పురస్కరించుకొని 600మంది రైతులతో సదస్సు, డిసెంబర్‌ 4న నూతన భవనాలు, ఆధునిక ల్యాబ్‌లు, గోదాములు ప్రారంభోత్సవాలు ఉంటాయన్నారు. 1991 నుంచి 2016 వరకు మహానంది వ్యవసాయ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, విద్యార్థులు, రైతులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రజతోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement