నందికొట్కూరులో కల్తీకల్లు స్వాధీనం | Adulteraised pamcalf captured in nandikotkur | Sakshi
Sakshi News home page

నందికొట్కూరులో కల్తీకల్లు స్వాధీనం

May 24 2017 10:35 PM | Updated on Sep 5 2017 11:54 AM

పట్టణంలో కల్లు దుకాణాలపై ఎక్సైజ్‌ శాఖ దాడులు నిర్వహించి..1400 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు.

–టాటాఏస్‌ వాహనం సీజ్‌
 
నందికొట్కూరు: పట్టణంలో కల్లు దుకాణాలపై ఎక్సైజ్‌ శాఖ దాడులు నిర్వహించి..1400 లీటర్ల కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. అలాగే టాటా ఏస్‌ వాహనాన్ని సీజ్‌ చేశారు.  ఈ సందర్భంగా ఎక్సైజ్‌ శాఖ కర్నూలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి సుధాకర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్తీ కల్లు దుకాణాలపై దాడులు చేశామన్నారు. కల్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి క్రిమినల్‌ కేసు  నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దాడుల్లో ఎక్సైజ్‌ శాఖ కర్నూలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శ్రీనివాసులు, రమణారెడ్డి, విజయవాడ ఎస్టీఫ్‌ అధికారి శ్రీకాంత్, నందికొట్కూరు ఎక్సైజ్‌ శాఖ ఎస్‌ఐలు దస్తగిరి, లక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement