భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు
హుజూర్‌నగర్ : మట్టపల్లి కృష్ణాపుష్కరాలకు ఈనెల 20న గవర్నర్ పర్యటన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
హుజూర్‌నగర్ : మట్టపల్లి కృష్ణాపుష్కరాలకు ఈనెల 20న గవర్నర్ పర్యటన నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. గురువారం మట్టపల్లిలోని ప్రహ్లాద ఘాట్‌ను పరిశీలించి గవర్నర్ పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్ పర్యటన షెడ్యూల్ ప్రకారం భక్తుల రద్దీని గుర్తించి అందుకు తగిన విధంగా అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించాలన్నారు. ప్రహ్లాద ఘాట్‌లో వీఐపీలకు కేటాయించిన ప్రదేశంలో నూతనంగా కంచె ఏర్పాటు చేయడంతోపాటు అదే ఘాట్‌లోని మిగిలిన ప్రదేశంలో సాధారణ భక్తులను అనుమతించే విషయంపై అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గవర్నర్ పూజలు నిర్వహించాక స్థానికంగా గల ముక్కూరు పీఠానికి వెళ్లే దారిని పరిశీలించాల్సిందిగా సూచించారు. జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లలో సీసీ కెమెరాల ఏర్పాటుతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నామని ఈనెల 19 నుంచి డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడనున్నట్లు తెలిపారు. ఆయన వెంట స్పెషల్‌ఆఫీసర్, డీఆర్‌డీఏ పీడీ అంజయ్య, మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, ట్రైనీ ఎస్పీ చందనాదీప్తి, డీఎస్పీ సునితామోహన్, సీఐ నర్సింహారెడ్డి, తహసీల్దార్ యాదగిరి, ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరు విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.