చిరుధాన్యాల కొనుగోలుకు చర్యలు | action for purchasing small grains | Sakshi
Sakshi News home page

చిరుధాన్యాల కొనుగోలుకు చర్యలు

Oct 22 2016 1:06 AM | Updated on Sep 4 2017 5:54 PM

చిరు ధాన్యాలను మార్కెట్‌ ధర ప్రకారం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు.

– జిల్లా వ్యాప్తంగా 15 కౌంటర్లు
– వచ్చేవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభం
– జేసీ హరికిరణ్‌ వెల్లడి
 
కర్నూలు(అగ్రికల్చర్‌): చిరు ధాన్యాలను మార్కెట్‌ ధర ప్రకారం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం జేసీ తన చాంబర్‌లో జొన్న, సద్దలు, కొర్రల కొనుగోలుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే వారం నుంచి కోనుగోళ్లు చేపట్టాలన్నారు. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో 15 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. ఆళ్లగడ్డ, ఆస్పరి, చాగలమర్రి, కోడుమూరు, కోవెలకుంట్ల, ఆత్మకూరు, గోనెగండ్ల, కొలిమిగుండ్ల, డోన్, పగిడ్యాల, పత్తికొండ, నంద్యాల, ఆదోని, ప్యాపిలి, పాణ్యంలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన చేయూతనివ్వాలని  మార్కెటింగ్‌ అధికారులను జేసీ ఆదేశించారు. సమావేశంలో జేడీఏ ఉమామహేశ్వరమ్మ, మార్కెటింగ్‌ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, మార్క్‌పెడ్‌ డీఎం పరిమళ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement