ప్రియురాలు లక్ష్మి హత్య కేసులో నిందితుడైన ప్రియుడు శివను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
గుత్తి : ప్రియురాలు లక్ష్మి హత్య కేసులో నిందితుడైన ప్రియుడు శివను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ మధుసూదన్‌గౌడ్ తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. గుత్తిలోని గుంతకల్లు రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద ఓ ఇంటిలో శివ, లక్ష్మి లు గత యేడాది కాలంగా సహ జీవనం సాగిస్తుండేవారు. అయితే లక్ష్మి ప్రవర్తనపై అనుమానం వచ్చింది. పద్ధతి మార్చుకొమ్మని చెప్పాడు.
అయినా ఆమె వినలేదు. దీంతో ఇతరులతో వ్యభిచారం చేస్తోందనే అనుమానంతో ఈ నెల 3న వేటకొడవలితో దారుణంగా నరిచి చంపాడు. నిందితుడు శివ పట్టణంలోని రాయల్ థియేటర్ వద్ద ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు.