జాతీయ రహదారిపై ప్రమాదంవ్యాన్‌ను ఢీకొట్టిన లారీ | accident on national higway.. lorry hits van | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై ప్రమాదంవ్యాన్‌ను ఢీకొట్టిన లారీ

Jul 26 2016 9:16 PM | Updated on Sep 4 2017 6:24 AM

జాతీయ రహదారిపై ప్రమాదంవ్యాన్‌ను ఢీకొట్టిన లారీ

జాతీయ రహదారిపై ప్రమాదంవ్యాన్‌ను ఢీకొట్టిన లారీ

సత్యనారాయణపురం (దెందులూరు)/ఏలూరు అర్బన్‌ : జాతీయ రహదారిపై దెందులూరు మండలం సత్యనారాయణపురం రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సత్యనారాయణపురం (దెందులూరు)/ఏలూరు అర్బన్‌  : జాతీయ రహదారిపై దెందులూరు మండలం సత్యనారాయణపురం రోడ్డు వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు రూరల్‌ గ్రామం శ్రీపర్రు, కష్ణా జిల్లా, మండవల్లి మండలం, నందిగామలంక, పెనుమాక లంక గ్రామాలకు చెందిన కొందరు కూలీలు దెందులూరు మండలం పోతునూరులో చేపల పట్టుబడికి  మంగళవారం ఉదయం శ్రీపర్రు నుంచి వ్యాన్‌లో బయలుదేరారు. వ్యాన్‌ జాతీయ రహదారి సమీపంలో ఉన్న  సత్యనారాయణపురం వద్దకు చేరుకున్న సమయంలో వెనుకగా వస్తున్న లారీ ఢీకొట్టింది.
దీంతో వ్యాన్‌ బోల్తాపడింది. వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వారిలో 16మంది తీవ్రంగా గయపడ్డారు. ఈ సమయంలో వ్యాన్‌లో 30 మంది కూలీలు ఉన్నారు. గాయపడిన వారు పెనుమాకలంక, నందింగంపాడు గ్రామాలకు చెందినవారుగా సమాచారం. క్షతగాత్రులను నాలుగు అంబులెన్సుల్లో పోలీసులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దెందులూరు పోలీసులు తెలిపారు.  ప్రమాదంపై సమాచారం అందుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ. వెంకటరమణ ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, ఎ.వి.ఆర్‌.మోహన్‌ను కోరారు.
 
 
 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement