మండలంలోని కలుగోడు సమీపంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. వరిగడ్డి లోడుతో బయలుదేరిన ట్రాక్టర్ ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో డ్రైవర్ సహా అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అత్యంత చాకచక్యంగా తప్పించుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
మార్గమధ్యంలో వ్యవసాయ బోర్లకు సరఫరా అవుతున్న విద్యుత్ తీగలు తగలి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలు చెలరేగి ట్రాక్టర్‌పై పడ్డాయి. డ్రైవర్‌తో సహ మరో ఇద్దరు ఇంజ¯ŒSలో కుర్చుకుని ప్రయాణిస్తుండగా ప్రమాదాన్ని గమనించి కిందకు దూకేశారు. మంటలు గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున తరలివెళ్లి గడ్డిని ట్రాక్టర్ నుంచి కిందకు పడేశారు. ఇంజన్, ట్రాలి దగ్ధం కాకుండా కాపాడారు. సంఘటనలో రూ.15 వేల వరిగడ్డి కాలిపోయింది.