ఏసీబీ వలలో విజిలెన్స్‌ అధికారి | ACB arrests regional vigilance enforcement officer on graft charges | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో విజిలెన్స్‌ అధికారి

Jan 13 2017 1:29 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ వలలో విజిలెన్స్‌ అధికారి - Sakshi

ఏసీబీ వలలో విజిలెన్స్‌ అధికారి

నల్లగొండ రీజినల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి (ఏఎస్పీ)భాస్కర్‌రావు గురువారం రూ.లక్ష తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ

రూ.లక్ష లంచం తీసుకుంటుండగా
 పట్టుకున్న అధికారులు
నల్లగొండ, హన్మకొండలోని ఇళ్లల్లో సోదాలు  


నల్లగొండ టూటౌన్‌/వరంగల్‌:  నల్లగొండ రీజినల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి (ఏఎస్పీ)భాస్కర్‌రావు గురువారం రూ.లక్ష తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కారు. నల్లగొండలో ఆయన నివాసం ఉంటున్న ఇంట్లో,  వరంగల్‌ జిల్లా హన్మకొండలోని ఆయన సొంత ఇంట్లో ఏక కాలంగా సోదాలు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ డి.సునీత కథనం ప్రకారం... నల్ల గొండ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విజిలెన్స్‌ ఏఎస్పీ  భాస్కర్‌రావు పట్టణ రైస్‌ మిల్లర్స్‌ నుంచి  రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైస్‌ ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉందని, కొంత తగ్గించాలని వేడుకు న్నా ఒప్పుకోలేదు. దీంతో నల్లగొండ పట్టణ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రేపాల భద్రాద్రి రాములు ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో  నల్లగొండలోని తన అద్దె ఇంట్లో రాములు రూ.లక్ష నగదు ఇస్తుండగా ఏసీబీ హైదరాబాద్, నల్లగొండ అధికారుల బృందం పట్టుకుంది. తన స్వస్థలమైన హన్మకొండ లోని ఇల్లు మామ వీరస్వామి పేరుతో ఉన్న దని, వరంగల్‌ రూరల్‌ జిల్లా ఆత్మకూరు మం డలంలో వ్యవసాయ భూమి, వరంగల్‌లో లేబర్‌ కాలనీలో ఒక భవనం ఉన్నట్లు గుర్తిం చారు. సుమారు  లక్ష రూపాయల నగదు, కారు, టూ వీలర్‌ వెహికిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement