కుమారుడి మృతిని తట్టుకోలేక ఓ తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలో జరిగింది.
కుమారుడి మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య
Aug 11 2016 12:23 AM | Updated on Nov 6 2018 7:56 PM
పరకాల : కుమారుడి మృతిని తట్టుకోలేక ఓ తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలో జరిగింది. ఎస్సై రవీందర్ కథనం ప్రకారం.. పట్టణంలోని మాదారం కాలనీకి చెందిన గూడెల్లి సరోజన(45) చిన్నకుమారుడు రవి నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. కుమారుడు మృతిచెందినప్పటి నుంచి సరోజన తాను కూడా చనిపోతానని రోదించేది. మతిస్థిమితం కోల్పోయినట్లు ప్రవర్తించేది. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన దామెర చెరువు కట్ట వద్ద ఉన్న గౌడ కమ్యూనిటీ హాల్ వద్ద పురుగుల మందు తాగి పడిపోయింది. గమనించిన స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ బుధవారం మృతిచెందింది. మృతురాలి పెద్దకుమారుడు సదయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Advertisement


