7,810 మంది ఉద్యోగులు రావాల్సి ఉంది | 7.810 employees scheduled to come | Sakshi
Sakshi News home page

7,810 మంది ఉద్యోగులు రావాల్సి ఉంది

Aug 29 2016 8:04 PM | Updated on Mar 23 2019 9:03 PM

హైదరాబాద్ నుంచి తరలిరావాల్సిన ఉద్యోగులు 7810 మంది ఉన్నారని ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చెప్పారు.

-ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు
తుళ్లూరు(గుంటూరు జిల్లా)

 హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిరావాల్సిన ఉద్యోగులు 7810 మంది ఉన్నారని, వారు కాకుండా ఒక్క సచివాలయం ఉద్యోగులే 2000 మంది ఉన్నారని ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు చెప్పారు. సోమవారం కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడ ఉన్నా ఉద్యోగాలు చేయాలని, సచివాలయంలో పనులు పూర్తిచేసి ఉద్యోగులు విధులు నిర్వహించుకునే వీలు కల్పిస్తే ఇక్కడినుంచి పాలన చేయడానికి వెనుకాడబోమని చెప్పారు. ఈ మేరకు తాత్కాలిక సచివాలయంలో ఇంకా ఏర్పాట్లు పూర్తికావాల్సి ఉందని వివరించారు. ప్రభుత్వం కూడా వేగవంతంగా పనులు పూర్తిచేసే విధంగానే ముందుకెళుతుందని తెలిపారు. ఇదే అభిప్రాయాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ కూడా వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement