ఏలూరు (మెట్రో) : ప్రభుత్వ ఉద్యోగులకు శనివారం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు వచ్చాయి. శనివారం రెండో శనివారం కావడంతో సెలవు. ఆదివారం సాధారణ సెలవు కాగా సోమవారం మహర్నవమిని పురస్కరించుకుని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా ఐదు రోజుల సెలవులు
Oct 8 2016 12:32 AM | Updated on Sep 4 2017 4:32 PM
ఏలూరు (మెట్రో) : ప్రభుత్వ ఉద్యోగులకు శనివారం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు వచ్చాయి. శనివారం రెండో శనివారం కావడంతో సెలవు. ఆదివారం సాధారణ సెలవు కాగా సోమవారం మహర్నవమిని పురస్కరించుకుని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించారు. అంటే సోమవారం వేతనంతో కూడిన సెలవును ప్రభుత్వం ఇస్తుంది. మంగళవారం విజయదశమి కాగా బుధవారం మొహర్రం సందర్భంగా సెలవుగా ప్రకటించారు.
వేతనాల పెంపు జీవో విడుదల
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన 10వ పీఆర్సీ వేతనాల్లో భాగంగా ఔట్ సోర్సింగ్‌లో విధులు నిర్వహించే పార్ట్ టైం, ఫుల్‌టైమ్ ఉద్యోగులకు వేతనాలు పెంచినట్టు ఎన్జీవో జిల్లా నాయకుడు ఆర్‌ఎస్ హరనాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుపై ఏలూరు తాలూకా ఎన్జీవో అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి కె.రమేష్ హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement