నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలికపై ఆ పాఠశాల అటెండర్ అసభ్యంగా ప్రవర్తించటంతో ఆమె కుటుంబసభ్యులు దేహశుద్ధి చేశారు.
ఆదిలాబాద్: నాలుగో తరగతి చదువుతున్న ఓ బాలికపై ఆ పాఠశాల అటెండర్ అసభ్యంగా ప్రవర్తించటంతో ఆమె కుటుంబసభ్యులు దేహశుద్ధి చేశారు. వివరాలివీ.. మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లోని ఆల్ఫోన్సా పాఠశాలకు చెందిన నాలుగో తరగతి విద్యార్థినితో ఆ పాఠశాల అటెండర్ శ్రీనివాస్ సోమవారం ఉదయం అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆ బాలిక సాయంత్రం ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులకు ఆ విషయం తెలిపింది. దీంతో వారు కుటుంబసభ్యులతో కలసి మంగళవారం పాఠశాలకు వచ్చి, నిర్వాహకులను నిలదీశారు. అటెండర్ శ్రీనివాస్‌ను చితకబాదారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనను నిరసిస్తూ ఏబీవీపీ, బీజేపీ, సీపీఐ, టీఆర్‌ఎస్ నాయకులు పాఠశాలకు ఎదుట ఆందోళనకు దిగారు. పాఠశాలకు తాళం వేసి ప్రై వేటు పాఠశాలలను బంద్ చేయించారు. ఎంఈవో పోచయ్య విచారణ జరిపారు. నిందితుడు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాకేష్ తెలిపారు.