48 కిలోల గంజాయి స్వాధీనం | 48 kgs of marijuana seized | Sakshi
Sakshi News home page

48 కిలోల గంజాయి స్వాధీనం

Oct 18 2016 5:24 PM | Updated on Sep 4 2017 5:36 PM

చోడవరం మండలం భోగాపురం వద్ద మంగళవారం సాయంత్రం 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

రోలుగుంట (విశాఖపట్టణం జిల్లా) : చోడవరం మండలం భోగాపురం వద్ద మంగళవారం సాయంత్రం 48 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు భోగాపురం శివారులో కాపుకాసిన పోలీసులు గంజాయి తీసుకెళుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 48 కిలోల గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement