గ్రూప్స్‌ శిక్షణకు 343 మంది ఎంపిక | 343 elect on groups training | Sakshi
Sakshi News home page

గ్రూప్స్‌ శిక్షణకు 343 మంది ఎంపిక

Feb 11 2017 9:45 PM | Updated on Sep 5 2017 3:28 AM

గ్రూప్‌-1, గ్రూప్‌-3 పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది.

అనంతపురం ఎడ్యుకేషన్‌ : గ్రూప్‌-1, గ్రూప్‌-3 పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది. సాంఘిక సంక్షేమశాఖ డీడీ రోశన్న శనివారం ఆ జాబితాను ప్రకటించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు గ్రూప్‌-1 పరీక్షకు 137 మంది, గ్రూప్‌-3 శిక్షణకు 206 మంది ఎంపికైనట్లు తెలిపారు.

ఎంపికైనవారు 3 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, ఆధార్, రేషన్‌కార్డు, బ్యాంకు పాసుబుక్కు జిరాక్స్, కుల, వార్షికాదాయం, విద్యార్హత సర్టిఫికెట్లతో ఈనెల 13, 14 తేదీల్లో కలెక్టరేట్‌ సమీపంలోని బీసీ స్టడీసర్కిల్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement