28 కిలోల గంజాయి పట్టివేత | 28 kilos horizon captured | Sakshi
Sakshi News home page

28 కిలోల గంజాయి పట్టివేత

Sep 24 2016 11:51 PM | Updated on Sep 4 2017 2:48 PM

కాజీపేట జంక్షన్‌లో శనివారం 28 కిలోల గంజాయిని జీఆర్‌పీ పోలీసులు పట్టుకున్నారు.

కాజీపేట రూరల్‌ : కాజీపేట జంక్షన్‌లో శనివారం 28 కిలోల గంజాయిని జీఆర్‌పీ పోలీసులు పట్టుకున్నారు. కాజీపేట జీఆర్‌పీ సీఐ మధుసూదన్‌ కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దొంతి రామాంజనేయులు అన్నవరంలో 28 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. ఆ గంజాయితో అనంతపురం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. అయితే రైల్వే అధికారులు విజయవాడ రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ సిస్టం ఆధునీకరణ పనుల కారణంగా ఈ రైలును కాజీపేట జంక్షన్‌ మీదుగా దారి మళ్లించారు.

ఈ క్రమంలో కాజీపేట జంక్షన్‌కు చేరుకున్న రైలు నుంచి గంజాయి బ్యాగుతో అతడు దిగాడు. పక్కన బ్యాగు పెట్టి ప్లాట్‌ఫాంపై నిల్చొని అటుఇటు దిక్కులు చూస్తుండగా పెట్రోలింగ్‌ సిబ్బందికి అనుమానం వచ్చి తనిఖీ చేయగా గంజాయి తరలింపును ఒప్పుకున్నాడు. రూ.42,000 విలువైన గంజాయి బ్యాగును స్వాధీనం చేసుకుని రామాంజనేయులును అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement