23న ఒలింపిక్‌ రన్‌


- 24 ప్రాంతాల్లో నిర్వహణకు ఏర్పాట్లు

భానుగుడి (కాకినాడ) :

అంతర్జాతీయ ఒలింపిక్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 23న జిల్లాలోని 24 ప్రాంతాల్లో ఒలింపిక్‌ రన్‌ నిర్వహించనున్నట్లు జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ కన్వీనర్‌ పి.చిరంజీవినికుమారి తెలిపారు. ఐడియల్‌ డిగ్రీ కళాశాల కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె ఈ వివరాలు తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, గొల్లవిల్లి, రాజోలు, రామచంద్రపురం, తుని, సామర్లకోట, పిఠాపురం, జగ్గంపేట, కిర్లంపూడి, దివిలి, అంబాజీపేట, మల్కిపురం, మండపేట, పెద్దాపురం, తాళ్ళరేవు, తాటిపాక, అన్నవరం, పెదపూడి, కాండ్రకోట, ర్యాలి, మామిడికుదురు, సఖినేటిపల్లి కేంద్రాల్లో ఆ రోజు ఈ ఒలింపిక్‌ రన్‌ నిర్వహిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జూన్‌ 20 నుంచి 22వ తేదీ వరకూ ఈ రన్‌ నిర్వహిస్తారని, జిల్లాలో 23న నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. రన్‌లో పాల్గొన్న అందరికీ ప్రశాంసా పత్రాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఒలింపిక్‌ రన్‌ బ్రోచర్‌ విడుదల చేశారు. కార్యక్రమంలో ఒలింపిక్‌ అసోషియేషన్‌ ఇన్‌ఛార్జి కార్యదర్శి వి.రవిరాజు, అధ్యక్షుడు చుండ్రు గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top