20 కిలోల వానపాములు పట్టివేత | 20 KGs Earthworms seized in PSR Nellore district | Sakshi
Sakshi News home page

20 కిలోల వానపాములు పట్టివేత

Aug 11 2015 2:24 PM | Updated on Sep 3 2017 7:14 AM

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న వానపాములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సూళ్లూరుపేట : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న వానపాములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తడ మండలం వేనాడు గ్రామానికి చెందిన వందేటి నాగేంద్ర అక్రమంగా వానపాములతో బైక్‌పై వస్తుండగా అతడిని వైల్డ్ లైఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అతడి వద్దనున్న వానపాములను అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. వానపాముల తరలింపు వన్యప్రాణుల చట్టం ప్రకారం నేరమని వైల్డ్ లైఫ్ రేంజి కుమార్రాజా తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement