పంపుల బావిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి | 2 years child died fell into a well | Sakshi
Sakshi News home page

పంపుల బావిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి

Jul 24 2016 12:30 AM | Updated on Sep 4 2017 5:54 AM

చినమిల్లిపాడు(ఆకివీడు) : చినమిల్లిపాడు మంచినీటి చెరువు సమీపంలోని పంపుల బావిలో ప్రమాదవశాత్తూ పడ డంతో ఓ రెండేళ్ల బాలుడు మరణించాడు.

చినమిల్లిపాడు(ఆకివీడు) :   చినమిల్లిపాడు మంచినీటి చెరువు సమీపంలోని పంపుల బావిలో ప్రమాదవశాత్తూ పడ డంతో ఓ రెండేళ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన శనివారం జరిగింది. చెరువు సమీపంలో నివశిస్తున్న నత్తా ఏసుబాబు ధనలక్ష్మిల రెండవ కుమారుడు రెక్కి(2) ఆడుకుంటూ వెళ్లి  పంపుల బావిలో పడిపోయాడు. బావిపై మూత లేకపోవడంతోపాటు బాలుడిని ఎవరూ గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రు లు వెతుకులాట ప్రారంభిం చారు. ఆఖరుకు బావిలో చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై ఏసోబు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.  
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement