పంపుల బావిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి
చినమిల్లిపాడు(ఆకివీడు) : చినమిల్లిపాడు మంచినీటి చెరువు సమీపంలోని పంపుల బావిలో ప్రమాదవశాత్తూ పడ డంతో ఓ రెండేళ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన శనివారం జరిగింది. చెరువు సమీపంలో నివశిస్తున్న నత్తా ఏసుబాబు ధనలక్ష్మిల రెండవ కుమారుడు రెక్కి(2) ఆడుకుంటూ వెళ్లి పంపుల బావిలో పడిపోయాడు. బావిపై మూత లేకపోవడంతోపాటు బాలుడిని ఎవరూ గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రు లు వెతుకులాట ప్రారంభిం చారు. ఆఖరుకు బావిలో చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై ఏసోబు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.