ఆటో బోల్తా: పది మంది విద్యార్థులకు గాయాలు | 10 students injured in auto accident | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: పది మంది విద్యార్థులకు గాయాలు

Sep 3 2015 9:08 PM | Updated on Sep 3 2017 8:41 AM

ఆటో బోల్తా పడిన ఘటనలో పది మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు.

గంగాధర నెల్లూరు/చిత్తూరుఅర్బన్: ఆటో బోల్తా పడిన ఘటనలో పది మంది విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈఘటన చిత్తూరు అర్బన్ మండలం ఎట్టేరి గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గుడిపాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పది మంది విద్యార్థులు కొత్తపల్లెమిట్లలో జరుగుతున్న ఆటల పోటీల్లో పాల్గొని ఆటోలో తిరిగి వస్తున్నారు.

ఆ ఆటో ఎట్టేరి సమీపంలో బోల్తా పడటంతో పది మంది విద్యార్థులు గాయపడ్డారు. వారందరినీ వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కిషోర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వాళ్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. గంగాధరనెల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement