లైంగికదాడి కేసులో నిందితుడి అరెస్టు | నిందితుడి అరెస్టు | Sakshi
Sakshi News home page

లైంగికదాడి కేసులో నిందితుడి అరెస్టు

Sep 13 2016 12:45 AM | Updated on Aug 21 2018 5:54 PM

బాలికపై లైంగిక దాడికి పాల్పడి, గర్భవతిని చేసిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సొంత మేనమామే ఆమెను గర్భవతిని చేసినట్టు పోలీసులు గుర్తించారు. అమలాపురం డీఎస్పీ ఎల్‌.అంకయ్య కథనం ప్రకారం.. గోపవరానికి చెందిన షేక్‌ మస్తాన్‌సాహెబ్‌ తన భార్య చనిపోవడంతో తల్లి ఇంటి వద్ద ఉంటున్నాడు.

ఉప్పలగుప్తం :
బాలికపై లైంగిక దాడికి పాల్పడి, గర్భవతిని చేసిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సొంత మేనమామే ఆమెను గర్భవతిని చేసినట్టు పోలీసులు గుర్తించారు. అమలాపురం డీఎస్పీ ఎల్‌.అంకయ్య కథనం ప్రకారం.. గోపవరానికి చెందిన షేక్‌ మస్తాన్‌సాహెబ్‌ తన భార్య చనిపోవడంతో తల్లి ఇంటి వద్ద ఉంటున్నాడు. అదే గ్రామంలో మస్తాన్‌సాహెబ్‌ సోదరి ఉంటోంది. ఆమె కుమార్తె 14 ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇటీవల బాలికకు నలతగా ఉండడంతో, కుటుంబ సభ్యులు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చూపించారు. బాలికకు పరీక్షలు చేసిన వైద్యులు ఆమె ఆరు నెలల గర్భిణి అని ధ్రువీకరించారు. మేనమామ మస్తాన్‌సాహెబ్‌ తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బాలిక చెప్పడంతో, ఈ నెల రెండున పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement