ఆటా నూతన కార్యవర్గం ఎంపిక | American Telugu Association new executive members selection | Sakshi
Sakshi News home page

ఆటా నూతన కార్యవర్గం ఎంపిక

Jan 21 2017 8:01 PM | Updated on Sep 5 2017 1:46 AM

ఆటా నూతన కార్యవర్గం ఎంపిక

ఆటా నూతన కార్యవర్గం ఎంపిక

అమెరికా తెలుగు సంఘం(ఆటా) నూతన కార్యవర్గం ఎంపికైంది. ఆటా ధర్మకర్తల మండలి సమావేశం నెవాడాలోని లాస్ వెగాస్‌లో ఈ జనవరి 14న నిర్వహించారు.

లాస్ వెగాస్‌: అమెరికా తెలుగు సంఘం(ఆటా) నూతన కార్యవర్గం ఎంపికైంది. ఆటా ధర్మకర్తల మండలి సమావేశం నెవాడాలోని లాస్ వెగాస్‌లో ఈ జనవరి 14న నిర్వహించారు. ఆటా నూతన అధ్యక్షుడిగా కరుణాకర్ ఆసిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆటాబోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు లాస్ వేగాస్, కాలిఫోర్నియాలలోని తెలుగువారు సహా 200 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు కరుణాకర్ ఆసిరెడ్డికి మాజీ అధ్యక్షుడు సుధాకర్ పెర్కారి బాధ్యతలు అప్పగించారు. ఆసిరెడ్డితో పాటు, కొత్తగా ఎన్నుకోబడిన ధర్మకర్తల మండలి సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. 
 
2017 నుంచి 2020వరకు గానూ ఆటా సభ్యుల ద్వారా ఎన్నికైన 13 మంది నూతన ధర్మకర్తల మండలి సభ్యులు భువనేశ్ బూజల, పరశురం పిన్నపురెడ్డి, వినోద్ రెడ్డి కోడూరు, జయంత్ చల్ల, క్రిష్ణ ద్యాప, రవీందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రఘువీర్ బండారు, మురళీ బొమ్మనవేని, సౌమ్య కొండపల్లి, కిరణ్ పాశం, రిందా కుమార్ సామ, శరత్ వేముల ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యనిర్వాహక, ధర్మకర్తల బృందం సభ్యులు ఆటా రాజ్యాంగం దాని అనుబంధ చట్టాలను గౌరవించి, పాటిస్తామని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గం పరమేష్ భీంరెడ్డిని ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా ఎన్నుకుంది. అధ్యక్షుడు ఆసిరెడ్డి మాట్లాడుతూ.. ఆటా స్థాపించబడిన ప్రధాన లక్ష్యాలను సభికులకు గుర్తుచేశారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు జాతికి, వారి సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించుకునేందుకు, తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు, ఇతర అంశాల్లో ప్రోత్సహించడానికి ఆటా అన్ని వేళలా కృషిచేస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. 
 
తనతో పాటు ఏర్పడిన నూతన కార్యనిర్వాహక బృందం తమ తదుపరి రెండు సంవత్సరాల కోసం ప్రణాళికలను ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉద్యోగావకాశాలపై అదేవిధంగా ఇమ్మిగ్రేషన్ పై అవగాహనా సదస్సులు, అమెరికాలో ఉండే హైస్కూల్ విద్యార్థులకు SAT ఉచిత శిక్షణ, కాలేజీ ప్రవేశాలపై అవగాహన సదస్సులు, భారత్ నుంచి వచ్చే పేరెంట్స్‌కు ఉచిత ఆరోగ్య, దంత క్యాంప్‌లు నిర్వహించడం, అవసరమైన వారికి అత్యవసర సాయం అందించనున్నట్లు వివరించారు. మాజీ అధ్యక్షుడు సుధాకర్ పెర్కారి, మాజీ కార్యనిర్వాహక టీమ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆటా ధర్మకర్తల మండలి, 2017-2018 కాలానికి ఈ కార్యనిర్వాహక బృందాన్ని ఎంచుకుంది.
అధ్యక్షుడు: కరుణాకర్ అసిరెడ్డి
అధ్యక్షుడు (ఎలెక్ట్): పరమేష్ భీంరెడ్డి
కార్యదర్శి: సౌమ్య కొండపల్లి
కోశాధికారి: కిరణ్ పాశం
సంయుక్త కార్యదర్శి: వేణుగోపాల్ రావు సంకినేని
సంయుక్త కోశాధికారి: శ్రీనివాస్ దార్గుల
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: మాధవి బొమ్మినేని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement