breaking news
ATA executive meeting
-
‘అంగరంగ వైభవంగా ఆటా కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం’
వర్జీనియా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 2022 జులై లో వాషింగ్టన్ డీసీలో నిర్వహించబోయే 17వ కాన్ఫరెన్స్ కమిటీ ప్రారంభ సమావేశం వర్జీనియాలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆటా కాన్ఫరెన్స్ బృందం 2022 జూలై 1 నుంచి 3 వరకు జరగనున్న ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ నిర్వహాణ గురించి చర్చించారు. ఈ వేడుకులకు సంబంధించి 200 మంది వాలంటీర్లతో 80 కమిటీ లను ఏర్పాటు చేశామని ఆటా ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశాన్ని ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ అడ్వైజరీ చైర్ జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశ్య, కాన్ఫరెన్స్ డైరెక్టర్ కేకే రెడ్డి, కో-కన్వీనర్ సాయి సుదిని, కో-ఆర్డినేటర్ రవి చల్లా, కో-డైరెక్టర్ రవి బొజ్జా మరియు స్థానిక కోఆర్డినేటర్ శ్రావణ్ పాడూరు నిర్వహించారు. ఈ కమిటీ ఫ్రారంభ సమావేశానికి ఆటా బోర్ద్ సభ్యులు న్యూజెర్సి రాష్ట్రం నుంచి రవి గూడురు, శరత్ వేముల షికాగొ నగరం నుంచి సీనియర్ ఆటా సభ్యులు చల్మ బండారు, మహేందెర్ ముస్కుల పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) అధ్యక్షురాలు సుధ కొండపు గారు మాట్లాడుతూ.. ఆటా మహోత్సవ వేడుకలకు క్యాట్స్ సహ ఆతిధ్య సంస్థ గా వ్యవహరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాన్ఫరెన్స్ కమిటీ కోఆర్డినేషన్ టీమ్ సభ్యులు హనిమి వేమిరెడ్డి, ప్రవీణ్ దాసరి, కౌశిక్ సామ, రవి చల్లా, హర్ష బారెంకబాయి మరియు లోహిత్ రెడ్దిలు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. -
ఆటా నూతన కార్యవర్గం ఎంపిక
లాస్ వెగాస్: అమెరికా తెలుగు సంఘం(ఆటా) నూతన కార్యవర్గం ఎంపికైంది. ఆటా ధర్మకర్తల మండలి సమావేశం నెవాడాలోని లాస్ వెగాస్‌లో ఈ జనవరి 14న నిర్వహించారు. ఆటా నూతన అధ్యక్షుడిగా కరుణాకర్ ఆసిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆటాబోర్డు సభ్యులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో పాటు లాస్ వేగాస్, కాలిఫోర్నియాలలోని తెలుగువారు సహా 200 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడు కరుణాకర్ ఆసిరెడ్డికి మాజీ అధ్యక్షుడు సుధాకర్ పెర్కారి బాధ్యతలు అప్పగించారు. ఆసిరెడ్డితో పాటు, కొత్తగా ఎన్నుకోబడిన ధర్మకర్తల మండలి సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. 2017 నుంచి 2020వరకు గానూ ఆటా సభ్యుల ద్వారా ఎన్నికైన 13 మంది నూతన ధర్మకర్తల మండలి సభ్యులు భువనేశ్ బూజల, పరశురం పిన్నపురెడ్డి, వినోద్ రెడ్డి కోడూరు, జయంత్ చల్ల, క్రిష్ణ ద్యాప, రవీందర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, రఘువీర్ బండారు, మురళీ బొమ్మనవేని, సౌమ్య కొండపల్లి, కిరణ్ పాశం, రిందా కుమార్ సామ, శరత్ వేముల ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యనిర్వాహక, ధర్మకర్తల బృందం సభ్యులు ఆటా రాజ్యాంగం దాని అనుబంధ చట్టాలను గౌరవించి, పాటిస్తామని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గం పరమేష్ భీంరెడ్డిని ప్రెసిడెంట్ ఎలెక్ట్‌గా ఎన్నుకుంది. అధ్యక్షుడు ఆసిరెడ్డి మాట్లాడుతూ.. ఆటా స్థాపించబడిన ప్రధాన లక్ష్యాలను సభికులకు గుర్తుచేశారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు జాతికి, వారి సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించుకునేందుకు, తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సామాజిక, ఆర్థిక కార్యకలాపాలు, ఇతర అంశాల్లో ప్రోత్సహించడానికి ఆటా అన్ని వేళలా కృషిచేస్తూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. తనతో పాటు ఏర్పడిన నూతన కార్యనిర్వాహక బృందం తమ తదుపరి రెండు సంవత్సరాల కోసం ప్రణాళికలను ఆవిష్కరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉద్యోగావకాశాలపై అదేవిధంగా ఇమ్మిగ్రేషన్ పై అవగాహనా సదస్సులు, అమెరికాలో ఉండే హైస్కూల్ విద్యార్థులకు SAT ఉచిత శిక్షణ, కాలేజీ ప్రవేశాలపై అవగాహన సదస్సులు, భారత్ నుంచి వచ్చే పేరెంట్స్‌కు ఉచిత ఆరోగ్య, దంత క్యాంప్‌లు నిర్వహించడం, అవసరమైన వారికి అత్యవసర సాయం అందించనున్నట్లు వివరించారు. మాజీ అధ్యక్షుడు సుధాకర్ పెర్కారి, మాజీ కార్యనిర్వాహక టీమ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఆటా ధర్మకర్తల మండలి, 2017-2018 కాలానికి ఈ కార్యనిర్వాహక బృందాన్ని ఎంచుకుంది. అధ్యక్షుడు: కరుణాకర్ అసిరెడ్డి అధ్యక్షుడు (ఎలెక్ట్): పరమేష్ భీంరెడ్డి కార్యదర్శి: సౌమ్య కొండపల్లి కోశాధికారి: కిరణ్ పాశం సంయుక్త కార్యదర్శి: వేణుగోపాల్ రావు సంకినేని సంయుక్త కోశాధికారి: శ్రీనివాస్ దార్గుల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్: మాధవి బొమ్మినేని