దేవాలయంలో ఎలుక ప్రదక్షిణలు.. భక్తుల పూజలు | Rat runs around tree in Karimnagar | Sakshi
Sakshi News home page

దేవాలయంలో ఎలుక ప్రదక్షిణలు.. భక్తుల పూజలు

Jul 26 2014 5:42 PM | Updated on Sep 2 2017 10:55 AM

దేవాలయంలో ఎలుక ప్రదక్షిణలు.. భక్తుల పూజలు

దేవాలయంలో ఎలుక ప్రదక్షిణలు.. భక్తుల పూజలు

యల్లమ్మ దేవాలయంలో ఓ ఎలుక మామిడి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసింది.

హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. బసవుసాయి పేటలోని యల్లమ్మ దేవాలయంలో ఓ ఎలుక మామిడి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఆ ఎలుక కొన్ని గంటల పాటు ఆగకుండా తిరుగుతూనే ఉంది. అంతేగాక విచిత్రమైన శబ్దాలు చేసింది.

అంతే ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది. విషయం తెలియడం ఆలస్యం భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలివచ్చారు. ఎలుక దైవ నామస్వరణ చేస్తూ ప్రదక్షిణలు చేస్తోందని భావించారు. ఎలుక ప్రదక్షిణలు చేస్తున్నచోటు పూజలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement