ప్రేయసి ఇక లేదని.. రైలు పట్టాలపై తలపెట్టి!

Youth Commits Suicide At Railway Station In Wanaparthy District - Sakshi

సాక్షి, ఆత్మకూరు: ప్రేయసి ఆత్మహత్య  చేసుకుని మృతిచెందడాన్ని తట్టుకోలేని ఓ యువకుడు తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలో ఈ ఘటన కలకలం రేపుతోంది.  ఆ వివరాలిలా.. విక్రమ్ అనే యువకుడు, సుస్మిత అనే ఇంటర్ విద్యార్థిని గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. అయితే వీరి ప్రేమ విఫలం కావడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తోంది. శుక్రవారం రాత్రి 11 గంటలకు గుళికల మందు తాగి ఆమె బలవన్మరణం చెందింది. 

నేటి ఉదయం విషయం తెలుసుకున్న విక్రమ్.. ప్రియురాలు లేదన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయాడు. తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఆత్మకూరు మండలంలోని శ్రీరామ్ నగర్ రైల్వేస్టేషన్‌కు ఆ యువకుడు రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు తలపైనుంచి వెళ్లడంతో తల, మొండెం వేరయ్యాయి. మృతుడి స్వగ్రామం కొత్తకోట మండలం అప్పరాల గ్రామం. కాగా, విక్రమ్ మృతితో అప్పరాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top