వధువు ఆత్మహత్య పెళ్లింట్లో విషాదం

Young Women Suicide In Adilabad - Sakshi

జన్నారం(కరీంనగర్‌): పెళ్లి చేసుకుని ఇతర రాష్ట్రానికి వెళ్లడం ఇష్టం లేక నవవధువు సూపర్‌వాస్మోల్‌ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. బాజాభజంత్రీలు మోగాల్సిన ఆ ఇంటా విషాదం చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలంలోని పొన్కల్‌ గ్రామానికి చెందిన టేకుమంట్ల రాజన్న, పంకజ దంపతులకు ముగ్గురు సంతానం. ఇందులో రెండో కూతురు ఆమని(28) ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో ఎస్‌బీఐలో క్యాషియర్‌గా పనిచేస్తోంది. ఈ మధ్యనే వివాహం నిశ్చయమైంది.

ఈ నెల 4న నిశ్చితార్థం కూడా జరిపారు. గురువారం(నేడు) వివాహం జరగాల్సి ఉంది. ఆమనిని వివాహం చేసుకునే వ్యక్తి ముంబయిలో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం చేసుకుని ముంబయికి వెళ్లాల్సి ఉందనే బెంగతో ఉండేది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు నచ్చజెప్పారు. అయిన దూరంగా వెళ్లి ఉండటం ఇష్టలేక బుధవారం ఉదయం ఇంట్లో ఉన్న సూపర్‌వాస్మోల్‌ తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన కుటుంబీకులు వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌ తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది.
 
పెళ్లికి అంతా సిద్ధం..
ఆమని వివాహం కోసం తల్లిదండ్రులు అంతా సిద్ధం చేశారు. సామగ్రి తెచ్చారు. పెళ్లి పత్రికలు పంచారు. టెంట్లు వేశారు. వంటమనిషిని మాట్లాడారు. వంట సామగ్రి తీసుకువచ్చారు. పచ్చనిపందిరి కోసం పొరకకు వెళ్దామనే సమయంలో అమ్మాయి ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులతోపాటు బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతురాలి తల్లి పంకజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top