పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య | Young Woman Commits Suicide In Vizianagaram | Sakshi
Sakshi News home page

ప్రేమ వైఫల్యమే కారణం..?

Sep 17 2018 1:48 PM | Updated on Nov 6 2018 8:08 PM

Young Woman Commits Suicide In Vizianagaram - Sakshi

గౌరీశ్వరి మృతదేహం

ప్రేమ వైఫల్యమే కారణం..?

విజయనగరం  , గజపతినగరం రూరల్‌: పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... మెంటాడ మండలం బడేవలసకు చెందిన యవర్ను గౌరీశ్వరి (24) బొండపల్లి మండలం బోడసింగిపేట కోర్టు కాలనీకి చెందిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సూరిశెట్టి రాంబాబు కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారు.

గౌరీశ్వరి విశాఖలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో ఏడాది కాలం పనిచేసి ప్రస్తుతం విజయనగరంలోని పీవీఆర్‌ ఆస్పత్రిలో పనిచేస్తోంది. ఇదిలా ఉంటే రాంబాబు ఇటీవలే విధులకు వెళ్లిపోయాడు. ఇంతలో ఏమైందో ఏమో కాని గౌరీశ్వరి  పురుగు మంది తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు సూసైడ్‌నోట్‌ రాసినట్లు సమాచారం. గౌరీశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement