
సునీతతో కూడా నర్సింహ్మ సహజీవనం చేస్తున్నాడు.
బంజారాహిల్స్: బావ తిట్టాడని మనస్తాపానికిలోనైన ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నర్సింహ్మ మేస్త్రీగా పని చేస్తూ భార్య దేవమ్మతో కలిసి మహాత్మగాంధీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. గత 16 ఏళ్లుగా అతని భార్య చెల్లెలు సునీత(26) కూడా వీరితోనే ఉంటూ ఇంటర్ వరకు చదువుకుంది. కాగా సునీతతో కూడా నర్సింహ్మ సహజీవనం చేస్తున్నాడు. వీరి మధ్య తరచూ గొడవ జరిగేది. మంగళవారం రాత్రి నర్సింహ్మ మద్యం సేవించి ఇంటికి రాగా, అద్దె చెల్లించేందుకు డబ్బులు లేవని ఇలాంటి స్థితిలో తాగడం, బజ్జీలు తేవడం అవసరమా అంటూ సునీత నిలదీసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపంతో గదిలోకి వెళ్లిన సునీత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నర్సింహ్మను అదుపులోకి తీసుకున్నారు.