గంగ కాలువపై సెల్ఫీ తీసుకుంటూ యువకుడి గల్లంతు

Young Man Drown In Ganga Canal While Taking Selfie In Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు : యువకుడు తెలుగుగంగ కాలువపై సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయిన సంఘటన ఉబ్బలమడుగు అడవిలో మంగళవారం జరిగింది.. పోలీసుల కథనం మేరకు చెన్నైకు చెందిన మహేష్‌కుమార్‌ కుమారుడు మనోజ్‌ (24) స్నేహితులైన మాణిక్యం, ప్రశాంత్‌తో కలసి మంగళవారం ఉబ్బలమడుగు అడవిలోని జలపాతానికి విహారయాత్రకు వచ్చారు. మనోజ్‌ స్నేహితులతో కలసి తెలుగు గంగ మెయిన్‌ కాలువపై నిలుచుని సెల్ఫీ తీసుకునేందుకు ఉపక్రమించాడు. కాలుజారి కాలువలో పడిపోయాడు. కాలువలోని నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.. ఈ విషయన్ని మాణిక్యం, ప్రశాంత్‌ స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ ధర్మారెడ్డి కేసు నమోదు చేసుకుని, మృతదేహాం కోసం గాలిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top